ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు ఆదేశాలు

-

రాష్ట్ర ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మెట్రో రైల్వే లైను వంపుల్లో పరిమితికి మించి వస్తున్న శబ్ద కాలుష్యంపై వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

సికింద్రాబాద్ సమీపంలోని బోయిగూడ రైల్వే ట్రాక్ వంపు వద్ద మెట్రో నుంచి రైలు మితిమీరిన శబ్దం వస్తోందని డాక్టర్ హనుమాన్లు హైకోర్టుకు లేఖ రాశారు. ఈ క్రమంలో శబ్ధ కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి, మెట్రో సంస్థకు ఆదేశాలు జారీ చేయాలంటూ డాక్టర్ హనుమాన్లు హైకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పరిమితికి మించి వస్తున్న రైలు శబ్దంతో  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి  తీసుకున్న  హైకోర్టు అంశాలను పరిశీలించి  ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి నోటీసులు జారీ చేసింది. వీటిపై వివరణ ఇవ్వాలని కోరింది. అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news