పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 6 నెలల గర్భిణిని ఆమె భర్త మంచానికి కట్టేసి సజీవ దహనం చేశాడు. ఈ ఘటన శుక్రవారం రోజున చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్‌సర్‌కు సమీపంలోని బుల్లెనంగల్‌కు చెందిన పింకీ, సుఖ్‌దేవ్ భార్యాభర్తలు. ప్రస్తుతం పింకి ఆరు నెలల గర్భవతి. ఈ దంపతుల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అలా శుక్రవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలో రాక్షసుడిలా మారిన సుఖ్‌దేవ్,.. పింకీని అక్కడే ఉన్న మంచానికి కట్టేసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత సుఖ్‌దేవ్ అక్కడి నుంచి భయంతో పరారైనట్లు వెల్లడించారు.
6నెలల గర్భిణిని సజీవ దహనం చేయడంపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిని అరెస్టు చేసి 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని పంజాబ్ డీజీపీకి మహిళా కమిషన్ లేఖ రాసింది.