తెలంగాణలో పగా వేసేందుకు ప్రధాని మోడీ బిగ్ స్కెచ్ వేశారు. ఈ నెల చివరి వారంలో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి ప్రధాని మోడీ రానున్నారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నారు ప్రధాని మోడీ. అలాగే… నామినేషన్ల తర్వాత ప్రచార పర్వాన్ని హోరెత్తించనుంది తెలంగాణ బీజేపీ.

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాల సభలకు ప్లాన్ వేసింది బీజేపీ పార్టీ. ఈ నెల చివరి వారంలో మేధావులతో ప్రధాని మోడీ భేటీ అయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం. రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వరసగా అగ్ర నేతల పర్యటన కూడా కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల చివరి నుంచి బీజేపీ అగ్ర నేతల ప్రచార సభలు, రోడ్ షోలు ఉంటాయి. ఇలా అన్ని వ్యూహ్యాలతో బీజేపీ దూసుకుపోతుంది.