సముద్రంలో ఎగురవేసిన జాతీయ జెండా.. వీడియో వైరల్

-

దేశవ్యాప్తంగా ఇవాళ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. హర్ ఘర్ తిరంగా అంటూ సామాన్యులు సైతం తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ నేపథ్యంలోనే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భారత కోస్ట్ గార్డ్ వినూతనంగా నిర్వహించింది. స్వాతంత్య్ర వేడుకలను సెలబ్రెట్ చేసుకునేందుకు ఓ అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

తమిళనాడులోని రామేశ్వరం వద్ద ఉన్నటువంటి సముద్రాన్ని స్వాతంత్య్ర వేడుకలకు వేదిక చేసుకుంది. ఈ వేడుకలను నీటి అడుగున నిర్వహించింది ఇండియన్ కోస్ట్ గార్డ్. నీటి అడుగున మువ్వన్నల జెండా ఎగురవేశారు కోస్ట్ గార్డులు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. నీటి అడుగు భాగానికి ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోను భారత కోస్ట్ గార్డ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన వారందరూ భారత్ మాతాకి జై అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక విధంగా ఇది నిజంగా ఓ గొప్ప విషయమనే చెప్పవచ్చు. నీటిలో జెండా ఎగురవేయడం మామూలు విషయం కాదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version