మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఫిక్స్ అయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా Devendra Fadnavis ను ఫైనల్ చేశారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ అధికారిక ప్రకటన చేసింది. భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో బిజెపి నేతలు… సుధీర్ ముంగంటి వార్, చంద్రకాంత్ పాటిల్ లాంటి నేతలందరూ కలిసి… శాసనసభ పక్ష నేతగా… దేవేంద్రను… ఎన్నుకోవడం జరిగింది.
దీంతో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. డిసెంబర్ 5 అంటే రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దేవేంద్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫైనల్ కావడంతో ఏక్ నాథ్ శిండే వర్గానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పదవి కావాలని మొదటి నుంచి షిండే వర్గం డిమాండ్ చేస్తుంది. కానీ ఎక్కువ సీట్లు బిజెపి గెలవడంతో.. వాళ్లు కూడా తగ్గలేదు. ఎక్కువ సీట్లు గెలిచిన వారే ముఖ్యమంత్రి కావాలని బిజెపి నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. ఈ తరుణంలోనే బిజెపి అభ్యర్థికి సీఎం పదవి రాబోతుంది.