రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈరోజు నుంచి షురూ కానున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులంతా గుజరాత్లోని జామ్నగర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అతిథులను ఆహ్వానిస్తూ ముకేశ్ సతీమణి నీతా అంబానీ ప్రత్యేక వీడియో సందేశం రిలీజ్ చేశారు.
తమ చిన్న కుమారుడు అనంత్ – రాధిక వివాహం విషయానికొస్తే తనకు రెండు ముఖ్యమైన కోరికలున్నాయని నీతా ఈ వీడియోలో చెప్పారు. మొదటిది.. మన మూలాలను గుర్తుంచుకునేలా వేడుకలు నిర్వహించాలని భావించామని, రెండోది.. ఈ వేడుక మన కళలు, సంస్కృతి, దేశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని కోరుకున్నామని తెలిపారు. ఇక, జామ్‌నగర్ తమ హృదయాలకు ఎంతో దగ్గరైన ప్రాంతమన్న నీతా తన కెరీర్‌ను ఇక్కడే ప్రారంభించానని చెప్పుకొచ్చారు.
మరోవైపు ప్రీ వెడ్డింగ్ వేడుకకు వచ్చిన ప్రముఖులంతా ఈ మధ్యాహ్నం వరకు వేదిక వద్దకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రీవెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరగనున్నాయి.
VIDEO | Nita Ambani, founder and chairperson of #RelianceFoundation, speaks on the pre-wedding function of her son Anant Ambani with Radhika Merchant at Jamnagar, #Gujarat. pic.twitter.com/0N3d1V0PoH
— Press Trust of India (@PTI_News) March 1, 2024