IPL 2023 : ‘BJP కార్యకర్త వల్లే చెన్నై గెలిచింది’ !

-

 

ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో CSK విజయం సాధించింది. వర్షం ఆగిన తర్వాత తిరిగి ప్రారంభమైన పోరులో డక్ వర్త్ లూయిస్ ప్రకారము 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK 5 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఓపెనర్స్ గా వచ్చిన ఋతురాజ్ గైక్వాడ్ 16 బంతుల్లో 26, కాన్వే 25 బంతుల్లో 47, శివమ్ దూబె 21 బంతుల్లో 32*, రహానే 8 బంతుల్లో 19, జడేజా 6 బంతుల్లో 15* రన్స్ చేశారు. జడేజా ఫోర్‌ కొట్టడంతో చెన్నై గెలిచింది.

అయితే… చెన్నై గెలవడంపై బీజేపీ కొత్త చర్చ పైకి తీసుకొచ్చింది. CSK విజయం వెనుక బిజెపి కార్యకర్త ఉండటం గర్వంగా ఉందని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నమలై అన్నారు. ‘రవీంద్ర జడేజా బిజెపి కార్యకర్త. ఆయన భార్య బిజెపి ఎమ్మెల్యే. జడేజా సిఎస్కే కోసం విన్నింగ్ షాట్ కొట్టారు. సిఎస్కే కంటే జీటీలోనే ఎక్కువ మంది తమిళ ప్లేయర్లు ఉన్నందుకు గర్వపడుతున్నా. సీఎస్కే లో ఒక్క తమిళ వ్యక్తి లేకపోయినా ధోని వల్ల సంబరాలు చేసుకుంటున్నాం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news