‘చెన్నై స్టోరీ’తో హాలీవుడ్​లోకి సమంత ఎంట్రీ

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘సిటాడెల్‌’లతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక త్వరలోనే ఈ బ్యూటీ హాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వబోతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘చెన్నై స్టోరీ’ అనే పేరు ఖరారైనట్లు సమాచారం. ‘బాఫ్టా’ పురస్కార విజేత ఫిలిప్‌ జాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విల్‌ మచిన్‌ నిర్మాత. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కే ఈ చిత్రంలో సమంతకి జోడీగా వివేక్‌ కల్రా నటించనున్నారు.

చెన్నై స్టోరీ కథేంటంటే.. లండన్‌లో స్థిరపడ్డ భారతీయ మూలాలున్న ఒక ఇంగ్లిష్‌ యువకుడు నిఖిల్‌ (వివేక్‌ కల్రా) తన తండ్రిని వెతుక్కుంటూ చెన్నై వస్తాడు. అక్కడ తనకి అను (సమంత) పరిచయం అవుతుంది. నిఖిల్‌ తండ్రిని వెతకడానికి సాయం చేయడానికి ఆమె ఒప్పుకుంటుంది. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ చెన్నై, బ్రిటన్‌లలో ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి.  తూర్పు, పశ్చిమ దేశాల సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ చిత్ర షూటింగ్‌ చెన్నై, బ్రిటన్‌లలో ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి. ఈ హాలీవుడ్‌ సినిమా ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news