మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత బాబా సిద్ధిక్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు తాజాగా ప్రకటించారు. 48 ఏళ్లుగా పార్టీలోనే ఉన్న ఆయన అకస్మికంగా తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీ అంశంగా మారింది. నేను యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరాను. దాదాపు 48 ఏళ్ల పాటు పార్టీలోనే ఉన్నాను. నేడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. చెప్పేందుకు చాలా ఉన్నా కొన్ని విషయాలను చెప్పకపోవడం మంచిది. ఇన్నేళ్లు నాకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలు నాయకులు సహచరులకు ధన్యవాదాలు అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
విద్యార్థి నాయకుడైన సిద్ధిక్ తొలుత బృవన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు కార్పొరేటర్ గా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాంద్రా పశ్చిమ నియోజకవర్గం నుంచి 1999 2004 2009లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆహార పౌరసరపరాల శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. దీంతోపాటు మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ముంబై విభాగానికి చైర్మన్గా పనిచేశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఇటీవల ఆయన కుమారుడుతో సహా రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవరును కలిశారు ఎన్సీపీలో చేరే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.