ఇస్రోకు ఇంకొక విజయం.. చందమామకు చేరువగా అంతరిక్ష నౌక…!

-

చంద్రయాన్-3ని తీసుకెళ్లేందుకు బెంగళూరులోని ఇస్రో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు.
ఎత్తును పెంచి, భూమికి ఇంకా దూరంగా చంద్రయాన్-3ని తీసుకు వెళ్ళడానికి బెంగళూరులోని ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ఐదవ భూ కక్ష్యను సోమవారం సక్సెస్ అయింది. దీని ద్వారా భారతదేశ ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ఇంకా సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

 

చంద్రయాన్-3 ఉపగ్రహం చంద్రుడి కి దగ్గరగా వెళ్ళింది. ఈ వ్యోమనౌక 1,27,609 కి.మీ X 236 కి.మీ కక్ష్య లోకి చేరుతుందని అంటున్నారు. అయితే కక్ష్యను పరిశీలించాకనే నిర్ధారిస్తారు అని ఇస్రో చెప్పడం జరిగింది. ఈ నౌక ని ప్రయోగించిన 11వ రోజున ఐదవ కక్ష్య ఏర్పడిందట. ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్ (TLI) ISRO తదుపరి స్టెప్.

ఆగస్టు 1 న 12am 1am మధ్య ప్లాన్ చేసారని ఇస్రో అంది. ఇది కూడా సక్సెస్ అయితే ఇస్రో అంతరిక్ష నౌక ని చంద్ర కక్ష్యలోకి స్లింగ్‌ షాట్ చేయడానికి ట్రై చేస్తుందట. చంద్రయాన్-3 చంద్రుని కక్ష్యకు చేరుకోవడానికి ఐదు రోజుల కంటే ఎక్కువ టైం ఏ తీసుకుంటుందని ఇస్రో తెలిపింది. ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ అయ్యే ప్రయత్నానికి ముందు ఇస్రో వరుస విన్యాసాలు చేస్తూ వుంది.

Read more RELATED
Recommended to you

Latest news