వ‌ర్క్ ఫ్రం హోం పై యాపిల్ సంస్థ కీల‌క నిర్ణయం

-

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా ప‌లు సాఫ్ట్ వేర్ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం ను కేటాయించాయి. అయితే ఇటీవ‌ల కాలంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌డం తో వ‌ర్క్ ఫ్రం హోం పై చాలా కంపెనీలు పున‌రాలోచ‌నలో ప‌డ్డాయి. అయితే ప్ర‌స్తుతం కరోనా వైర‌స్ కోత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి తీవ్రం గా ఉండ‌టంతో ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం ను మ‌రింత కాలంలో కేటాయించాల‌ని ప‌లు కంపెనీలు భావిస్తున్నాయి.

తాజాగా దిగ్జ‌జ కంపెనీ యాపిల్ సంస్థ కూడా వ‌ర్క్ ఫ్రం హోం పై కీల‌క నిర్ణయం తీసుకుంది. త‌మ సంస్థ లో ప‌ని చేస్తున్న ఉద్యోగులకు మ‌రింత కాలం వ‌ర్క్ ఫ్రం హోం కేటాయిస్తు నిర్ణయం తీసుకుంది. త‌దుప‌రి ప్ర‌క‌ట‌న చేసే వర‌కు వ‌ర్క్ ఫ్రం హోం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా త‌మ సంస్థ లో ప‌ని చేస్తున్న ఉద్యోగులుకు 1000 డాల‌ర్లు ( రూ. 76,131 ) బోన‌స్ గా కూడా ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Latest news