రేపు కాంగ్రెస్ పార్టీ లో డీ. శ్రీనివాస్ చేరనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు పిలుపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఆదేశాలతో పార్టీ లో చేరనున్నారు డీ. శ్రీనివాస్. ఈ మేరకు డీ. శ్రీనివాస్ చేరిక పై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి… ఠాగూర్ కు ఆదేశాలు జారీ చేశారు సోనియా గాంధీ.
రేపు ఉదయం 11 గంటల సమయంలో… ఢిల్లీలో… డీ. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు. అయితే.. ఎవరి సమక్షంలో డీ. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ లో చేరతారనే దానిపై క్లారిటీ రాలేదు. కాగా ప్రస్తుతం డీ. శ్రీనివాస్…. టీఆర్ ఎస్ పార్టీ రాజ్య సభ సభ్యుడిగా ఆయన ఉన్నారు. నిజంగానే డీ. శ్రీనివాస్… కాంగ్రెస్ పార్టీలో చేరితే.. బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ కు షాక్ తప్పదు.