సీఎం కేసీఆర్ కు సిఎల్పీ నేత భట్టి బ‌హిరంగ‌ లేఖ

-

సీఎం కెసిఆర్ కు సిఎల్పీ నేత భట్టి విక్ర‌మార్క బ‌హిరంగ లేఖ రాశారు. టీచర్ల బదిలీలు పై సరైన నిర్ణయం తీసుకోవాలని.. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ లు చేయడం ఏంటని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. టీచర్ల బదిలీలు ఆగమేఘాల పై నిర్ణయాలు తీసుకుంటుందని.. హేతుబద్ధత లేకుండా గందరగోళం సృష్టిస్తోందని మండిప‌డ్డారు. ముందు ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని.. జీవో 317 విడుదల విషయంలో క్లారిటీ లేదన్నారు.

భార్యాభర్తలు వేరువేరుగా ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటదని.. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్న తల్లిదండ్రులను పట్టణాలకు దూరంగా ట్రాన్స్ఫర్ చేయొద్దని ఆగ్ర‌హించారు. సమగ్ర స్టడీ- గందరగోళం రాకుండా బదిలీలు చేయాలని.. టీచర్ల బదిలీల్లో ఫైరవిలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. టీచర్ల ఇబ్బందులను తెలుసుకొని బదిలీలు చేస్తే బాగుంటుందని.. విద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే విద్యా వ్యవస్థపై తివృమైన ప్రభావం పడుతుందని వెల్ల‌డించారు. సరైన మార్గదర్శకాలు లేకుండా బదిలీలు చేస్తే విద్యార్థుల భవిష్యత్ పై ప్రభావం ఉంటుంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news