బిపిన్ రావ‌త్ స్థానం లో ఆర్మీ చీఫ్ మ‌నోజ్ ముకుంద్ ?

-

ఇప్ప‌టి వ‌ర‌కు సీడీఎస్ గా ఉన్న బిపిన్ రావ‌త్ మృతి చెంద‌డం తో కొత్త సీడీఎస్ గా ఎవ‌రు వ‌స్తార‌నే చర్చ ప్రారంభం అయింది. బిపిన్ రావ‌త్ మ‌ర‌ణం తో దేశం విషాద‌క‌ర ప‌రిస్థితులు ఉన్నా.. ర‌క్ష‌ణ విష‌యం లో ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని ప్ర‌ధాని మోడీ భావించార‌ట‌. నిన్న జ‌రిగిన క్యాబినేట్ స‌మావేశం లో కూడా ఈ విషయం పై చర్చించార‌ని తెలుస్తుంది. త్రివిధ ద‌ళాల‌కు కొత్త గా ఎవ‌రి అధిపతి గా చేయాల‌ని చ‌ర్చించార‌ని తెలుస్తుంది.

అయితే త్రివిధ ద‌ళాల‌కు కొత్త బాస్ గా ప్ర‌స్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న మ‌నోజ్ ముకుంద్ న‌ర‌వణే ను ఎంపిక చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. గ‌తంలో బిపిన్ రావత్ కూడా ఆర్మీ చీఫ్ గా చేసిన త‌ర్వాతే సీడీఎస్ గా ఎంపిక అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం వైస్ సీడీఎస్ గా ఉన్న ఎయిర్ మార్ష‌ల్ రాధాకృష్ణ ను కూడా సీడీఎస్ గా ఎంచుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ త‌మిళ నాడు లో ని కూనూమ ప్రాంతం లో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం లో మృతి చెందిన విష‌యం తెలిసిందే.

 

ఈ ప్ర‌మాదం లో ఆయ‌న తో పాటు ఆయ‌న భార్య మ‌ధులిక తో స‌హా మొత్తం 13 మంది మ‌ర‌ణించారు. సీడీఎస్ బిపిన్ రావ‌త్ తో పాటు ఆయ‌న భార్య మ‌ధులిక ల అంత్య క్రియ‌లు రేపు నిర్వ‌హించ‌నున్నారు. అయితే..

Read more RELATED
Recommended to you

Exit mobile version