కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. పార్టీ అధ్యక్ష భరి నుంచి తాను తప్పుకుంటున్నట్లు గురువారం మధ్యాహ్నం ఆయనే స్వయంగా ప్రకటించారు. గురువారం ఆయన ఢిల్లీలో సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై తాను సోనియాగాంధీని క్షమాపణలు కోరినట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని పార్టీ అధిష్టానం నుంచి గెహ్లాట్ కు ఆహ్వానం అందిన నేపథ్యంలో.. ఆయన సోనియా గాంధీతో భేటీ తర్వాత కేరళలో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి గేహ్లాట్ కే అంటూ విశ్లేషణలు సాగుతున్న వేళ.. గెహ్లాట్ సొంత రాష్ట్రం రాజస్థాన్లో మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టే దిశగా కీలక అడుగులు వేశారు. ఈ పరిణామం తనని తీవ్ర మనస్థాపానికి గురిచేసిందని.. ఈ పరిణామాలపై సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.