ఆసియా కప్ 2023 టోర్నమెంట్లో… 12వ సారి శ్రీలంక జట్టు ఫైనల్స్ కు చేరింది. నిన్న పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో… శ్రీలంక జట్టు అద్భుత విజయం సాధించింది. పాకిస్తాన్ జట్టుపై ఏకంగా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి… ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. నిన్నటి మ్యాచ్ లో వర్షం అడ్డంకి గా మారిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే 42 ఓవర్లకు మ్యాచులు కుదించారు.

దీంతో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు 42 ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఇక లక్ష్య చేదనలో… శ్రీలంక జట్టు… 8 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఫైనల్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలంక జట్టు. ఇక ఆదివారం రోజున… టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అటు ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నిష్క్రమించాయి.