Asia Cup 2023 : ఇవాల్టి నుంచే ఆసియా కప్ ప్రారంభం.. ఇలా “ఫ్రీ” గా చూసే అవకాశం !

-

నేటి నుంచే ఆసియా కప్‌ పోరు ప్రారంభం కానుంది. టీమిండియా ప్లేయర్లు ఆసియాకప్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. గత ఆరు రోజులుగా బెంగళూరు శివారులోని ఆలూర్ క్యాంప్ లో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లలో 17 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. శిక్షణ శిబిరం నిన్నటితోనే ముగిసింది. ఇక ఇవాళ భారత జట్టు.. శ్రీలంక కు బయలుదేరనుంది.

ఆసియాకప్ లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్ ను సెప్టెంబర్ 2న పాక్ తో ఆడనుంది.ఇక ఆసియా కప్ మ్యాచ్ లు అన్నీ కూడా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లోనే ప్రసారం కానున్నాయి. ఇక డిజిటల్ ప్రసారం డిస్నీ + హాట్ స్టార్ లో రానుంది. అయితే ఈ మ్యాచ్ లను వీక్షించడానికి అభిమానులు ఎటువంటి రుసుమును చెల్లించకుండా ఉచితంగా చూడొచ్చట. డిస్నీ + హాట్ స్టార్ లో ఉచితంగా చూసే వెసులుబాటును కల్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news