మహిళల నగ్న ఊరేగింపు వీడియోపై సీఎం సంచలన కామెంట్స్

-

మణిపూర్ వీడియోపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వాక్యాలు చేశారు. ‘మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై చాలా రోజుల క్రితమే కేసు నమోదయింది. వీడియో కూడా దొరికింది. కానీ పార్లమెంట్ సమావేశాల ముందు రోజే వీడియోను లీక్ చేశారు. ఇందులో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉంది. మణిపూర్ లో బిజెపి సర్కారు ఉండడం వల్లే కాంగ్రెస్ నిందిస్తోంది. బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి’ అని మండిపడ్డారు.

కాగా, ఇంఫాల్‌ః మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు ప్రధాన మంత్రి మోడీ కూడా పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ అంశంపై స్పందించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news