వాళ్లు ముస్లింలను, ఇస్లాంను ద్వేషిస్తూనే ఉంటారు.: అసదుద్దీన్ ఓవైసీ

-

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మదరసాలపై చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. అస్సాంలో వరదల వల్ల 18 మంది ప్రజలు చనిపోతే అది వదిలిపెట్టి మదరసాలపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా మదరసాలు పోరాడాయని అన్నారు. మదరసాల్లో గణితం, సైన్స్ బోధిస్తున్నారని అన్నారు. బీజేపీ వాళ్లకు ముస్లింలు అన్నా, ఇస్లాం అన్నా ద్వేషం అని విమర్శించారు.

Asaduddin

ఇటీవల సీఎం బిశ్వశర్మ మదరసాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో విద్య గురించి మాట్లాడుతూ…మదరసా అనే పదానికి స్వస్తి పలకాలని అన్నారు. మదరసా ఉన్నంత వరకు పిల్లలు డాక్టర్లు కావాలి… ఇంజనీర్ కావాలని ఆలోచించరని ఆయన అన్నారు. విద్యార్థులు మదరసాలో ప్రవేశించాలంటే వారి సొంత నిర్ణయం తీసుకునే వయసు వచ్చిన తర్వాతే మదరసాల్లో చేరాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఏదైనా ఎంపిక చేసుకునే విద్యా వ్యవస్థగా మదరసాలు మారాలి అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై నిన్న జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ కూడా విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version