Australia vs Afghanistan, 39th Match : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటిలాగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభం కానుండగా… ఈ మ్యాచ్కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా కానుంది.
అయితే ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం సాధిస్తే సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓడిపోతే పాకిస్తాన్ జట్టుకు చాన్సులు ఉంటాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఖచ్చితంగా ఆఫ్గనిస్తాన్ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక అటు ఆస్ట్రేలియ జట్టు చాలా భయంకరంగా కనిపిస్తోంది. మొదట్లో రెండు మ్యాచ్లు వరుసగా ఓడిపోయినప్పటికీ… పుంజుకున్న ఆస్ట్రేలియా సెమిస్ రేస్ లో ఉంది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధిస్తే ఆస్ట్రేలియా నేరుగా సెమీఫైనల్ లకు చేరుతుంది. మూడవ స్థానంలో నిలుస్తుంది ఆస్ట్రేలియా జట్టు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.