అయోధ్య బాలరాముడికి ఇవాళ 125 కలశాలతో స్నానం

-

రాముడి ప్రాణప్రతిష్ఠకు అయోధ్య నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువులు సంప్రదాయ బద్దంగా కొనసాగుతున్నాయి. ఈనెల 16 నుంచి జరుగుతున్న క్రతువులు సోమవారం ఉదయానికి పూర్తవనున్నాయి. ఈ క్రతువుల్లో భాగంగా ఇవాళ బాలరాముడికి 125 కలశాలతో స్నానం చేయించనున్నారు. ప్రస్తుతం తాత్కాలిక మందిరం పూజలందుకుంటున్న శ్రీరాముని విగ్రహాన్ని ఈరోజు రాత్రి 8 గంటలకు నూతన ఆలయంలోకి చేర్చుతామని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. తర్వాత భక్తులను శ్రీరాముని దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పారు.

మరోవైపు ప్రాణప్రతిష్ఠ వేడుకలో కర్తలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు పాల్గొననున్నాయి. రామాలయం ప్రారంభోత్సవం కోసం వేలాది మంది సాధువులు  అయోధ్యకు చేరుకున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులకు తీర్థ క్షేత్రపురంలో ట్రస్టు నిర్వాహకులు బస కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 4 వేల మంది సాధువులు పాల్గొననున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికశోభ ఉట్టిపడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version