అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ.. విగ్రహం ఎదురుగానే!

-

అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరిగి ఆర్నెళ్లయింది. అప్పుడే ఈ ఆలయ నిర్మాణంలోని పలు లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా రామమందిరం పైకప్పులో లీకేజీ ఏర్పడ్డాయని ఆలయ ప్రధాన పూజరి ఆచార్య సత్యేంద్ర దాస్‌ తెలిపారు. ఈ లీకేజీ వల్ల గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్లు వెల్లడించారు.

ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మొదటిసారి శనివారం రోజు రాత్రి భారీ వర్షం పడింది. ఈ క్రమంలోనే ఈ లీకేజీ సమస్య బయటపడిందని ఆయన తెలిపారు. ఈ వర్షపు నీరు సరిగ్గా బాలరాముడి విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే, వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలోనే కారుతోందని దాస్‌ వెల్లడించారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకూ సరైన ఏర్పాట్లు లేవని.. ఈ సమస్యపై ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ లీకేజీపై రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర స్పందిస్తూ.. ఆలయానికి చేరుకుని పైకప్పుని వాటర్‌ప్రూఫ్‌గా మార్చేలా మరమ్మతు పనులు చేయాలని సూచించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news