కాంగ్రెస్‌ పార్టీని వీడటంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక ప్రకటన !

-

కాంగ్రెస్‌ పార్టీని వీడటంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం రాత్రి దాదాపు గంటసేపు జీవన్ రెడ్డిని బుజ్జగించారు మంత్రి శ్రీధర్ బాబు. జగిత్యాల లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ని చేర్చుకోవడంతో రాజీనామా చేస్తానని మంత్రికి శ్రీధర్ బాబుకు చెప్పారట ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

పార్టీలో తనకు తగిన గౌరవం ఇవ్వకపోవడంతోనే నిర్ణయం తీసుకుంటున్నానని… పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా కొనసాగాలని మంత్రిని ప్రశ్నించారట జీవన్ రెడ్డి. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని…ప్రభుత్వానికి అండగా ఉండేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీ లో చేర్చుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత పార్టీపై ఉంది… భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news