వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వెల్లడించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలోని ఓ రథయాత్రలో అమిత్షా పాల్గొన్నారు.”రాహుల్ బాబా! సబ్రూమ్ నుంచి చెబుతున్నా విను.. అయోధ్య రామమందిరం జనవరి 01, 2024 నాటికి పూర్తవుతుంది” అని అమిత్ షా అన్నారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే రామ మందిర సమస్యను ఏళ్ల తరబడి కోర్టులో మగ్గిపోయేలా చేశాయని షా ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన వెంటనే నరేంద్ర మోదీ రామ మందిరానికి భూమి పూజ చేశారన్నారు. రామమందిరం అంశాన్ని 1990లో తమ అగ్ర నేత ఎల్కే అడ్వాణీ రథయాత్ర చేపట్టిన నుంచి లేవనెత్తుతోంది బీజేపీ. ఇప్పుడు కూడా మరోసారి ఆ అంశాన్ని తెరపైకి చెచ్చి 2024లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అస్త్రంగా ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.