అయోధ్య మందిర నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం

-

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆలయ నిర్మాణ పనులు త్వరలో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆలయ మొదటి అంతస్తులో నిర్మించబోయే శ్రీరాముడి దర్బార్​ సహా రెండో అంతస్తు పనులు వెంటనే మొదలుకానున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తవుతాయని మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర శర్మ తెలిపారు.  ఆలయం పార్కోట, 795 మీటర్ల పరిక్రమ గోడ వంటి తదితర పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు.

రామమందిర మొదటి అంతస్తు పూర్తయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం ఈ ఆలయం మూడు అంతస్తుల్లో నిర్మితమవుతున్నాయి. పనులు మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ నిర్మాణ కమిటీ శనివారం రోజున సమావేశమై భక్తుల సౌకర్యాలు త్వరితగతిన పూర్తి చేయడం సహా రామమందిరం రెండో అంతస్తు నిర్మాణం ప్రణాళికపై చర్చించారు.

మరోవైపు కొత్త మందిరంలో కొలువుదీరని బాలరాముడిని  దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news