హెచ్‌జీసీఎల్‌ ఎండీగా ఆమ్రపాలి

-

హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలను ప్రస్తుతం హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ కె.ఆమ్రపాలికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అదే కాకుండా  అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌ అదనపు బాధ్యతలను కూడా అప్పజెప్పింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో పాలిటన్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.దానకిషోర్‌ శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆమ్రపాలి హెచ్‌ఎండీఏ ఐటీ, ఎస్టేట్‌ విభాగాలతోపాటు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెలవలప్‌మెంట్‌ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు అదనపు బాధ్యతలను ఆమెకు అప్పగించారు.

Key Responsibilities of Amrapali

మరోవైపు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్‌ కూడా హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ నెల 6వ తేదీన హెచ్‌ఎండీఏపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. శనివారం రోజున హెచ్‌ఎండీఏ కార్యాలయానికి వచ్చిన దానకిషోర్‌  వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన దస్త్రాలను కూడా పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news