పన్ను చెల్లింపుదారులకు బ్యాడ్ న్యూస్..!

-

ఎక్కువ మంది కొత్త ఆదాయపు పన్ను ఎంపిక చేసుకోడానికి పాత పన్ను విధానం తప్పనిసరిగా తొలగి పోవాలని రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్ అన్నారు. అయితే పన్ను ప్రయోజనాలు తగ్గించడంతో చాలా మంది డిడక్షన్లను క్లయిమ్ చేసుకునేందుకు ఇంకా పాత పన్ను విధానాన్నే ఎంచుకోవడం జరిగింది.

 

incometax

కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం పన్ను విధానాన్ని సులభతరం చేసి, రేట్లను తగ్గించింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్ర బడ్జెట్ 2020-21లో ప్రభుత్వం సరి కొత్త, సరళీకర ఆదాయపు పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. 80సీ కింద వచ్చే ప్రయోజనాలు, స్టాండర్ డిడక్షన్ వంటి పలు మినహాయింపులను కొత్త పన్ను విధానం కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వదులుకోవాల్సి ఉంటుంది.

అయితే కొత్త పన్ను విధానమైతే రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్య ఆదాయమున్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు 10 శాతం పన్నునే చెల్లించాలి. ఇది ఇలా ఉంటే పాత పన్ను విధానంలో ఇది 20 శాతంగా ఉండేది. సెక్షన్ 87ఏ కిందనున్న రిబేట్ల ప్రకారం, రూ.5 లక్షల వరకు ఆదాయం సంపాదించే వారు ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు.

ఈ విధానం వ్యక్తిగత ఆదాయపు పన్నులను తగ్గించేందుకే ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక విధానంలో రూ.50 ఆదా అయినా కూడా తాను కూడా అదే విధానాన్ని ఎంపిక చేసుకుంటానని అన్నారు. అయితే రూ.8 లక్షల నుంచి రూ.8.5 లక్షల ఆదాయం సంపాదిస్తున్న వారు పాత పన్ను విధానం కింద 80సీ, స్టాండర్డ్ డిడక్షన్ తో పాటు మరి కొన్ని లాభాలు పొంది పన్ను కట్టడం లేదు. పాత విధానాన్ని నిర్వీర్యం చేసేంత వరకు కొత్త పన్ను విధానాన్ని చేపట్టరని.. కొత్త విధానాన్ని ప్రోత్సహించాల్సినవసరం ఉందని బజాజ్ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news