తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశానికి ప్రధాని కావాలంటూ… చాలా మంది టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు కోరుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి వంటి వారు ఏకంగా తన మనుసులో మాట బయటపెట్టారు. తెలంగాణలో ఉన్న పథకాలు.. భారతదేశం మొత్తం రావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరకున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ ప్రధాని కావాలిని మరో మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు.
కేసీఆర్ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. రైతులు, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ఏకైక నేత సీఎం కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో రైతుల తలరాత మార్చారని…వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. బీజేపీ, కాంగ్రేసేతర కూటమి కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రస్తుతం ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో సీఎం కేసీఆర్ ఉన్నారు. వరసగా ఎన్డీయేతర సీఎంల ను కలుస్తున్నారు.