కరోనా కట్టడిలో భాగంగా మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు సంబంధించి పలు మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే మూడో దశ లాక్ డౌన్ ప్రారంభం కానున్న మే 4 నుంచి ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రమే సెలూన్ షాప్‌లకు అనుమతిస్తున్నట్టు కేంద్రం శనివారం స్పష్టం చేసింది. రెడ్ జోన్లలో మాత్రం సెలూన్ షాప్‌లకు అనుమతి లేదని తెలిపింది. అలాగే ఈ జోన్లలో ఈ-కామర్స్ సంస్థల ద్వారా అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది.
కాగా, లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రెడ్ జోన్లలో మాత్రం ఈ సడలింపులు వర్తించవని స్పష్టం చేసింది. అక్కడ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్టు ప్రకటించింది.
కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 37,336 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9,950 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 1,218 మంది మృతిచెందారు.