‘హెల్త్‌ ఎమర్జెన్సీ’ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి : ప్రధాని మోదీ

-

హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి. దాన్ని నివారించేందుకు భారతదేశం సంసిద్ధంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిర్దేశిత 2030 లక్ష్యానికి ముందే క్షయ వ్యాధి నిర్మూలన దిశగా భారత్‌ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన జీ 20 ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో సాంకేతికత లభ్యతను అందరికి సులభతరం చేసేలా చొరవ చూపాలని జీ 20 సభ్యదేశాలకు పిలుపునిచ్చారు.

ఆరోగ్య రంగంలో అంతర్జాతీయ స్థాయి చొరవ.. అందరిప్రయత్నాలకు ఒక ఉమ్మడి వేదికగా నిలుస్తుందని మోదీ అన్నారు. డిజిటల్ విధానాలు, ఆవిష్కరణలు ఇందుకు తోడ్పడతాయని.. ప్రజాప్రయోజనాల కోసం ఆవిష్కరణలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకే పనికి వేర్వేరుగా నిధుల వినియోగాన్ని నివారించేందుకు సహకరించాలని మోదీ కోరారు. ‘నిక్షయ్‌ మిత్ర’ కార్యక్రమం కింద భారత్‌లో దాదాపు 10 లక్షల మంది క్షయ రోగులను పౌరులు దత్తత తీసుకున్నారని.. 2030 ప్రపంచ లక్ష్యానికి చాలా ముందుగానే దేశంలో టీబీ నిర్మూలిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version