బెంగాల్​లోని శాంతినికేతన్‌కు యునెస్కో గుర్తింపు

-

పశ్చిమ బెంగాల్‌లో ప్రఖ్యాత బెంగాలీ కవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ముందు నిర్మించిన ‘విశ్వ-భారతి’ విశ్వవిద్యాలయానికి నెలవైన శాంతినికేతన్‌కు అరుదైన గుర్తింపు దక్కింది. చారిత్రక ప్రదేశమైన శాంతినికేతన్​కు ప్రతిష్ఠాత్మక యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో సంస్థ దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. ఈ మేరకు ఆదివారం ప్రకటించి అభినందనలు తెలియజేసింది.

శాంతినికేతన్‌కు యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. శాంతినికేతన్​ను మరింత అభివృద్ధి చేసి.. రాబోయే తరాలకు ఈ చారిత్రక ప్రదేశం విశేషత తెలియజేస్తామని అన్నారు. బెంగాలీ కవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్​ను నిర్మించి వందేళ్లు దాటింది.

కోల్‌కతాకు సుమారు 160 కి.మీ. దూరంలో బోల్పుర్‌ పట్టణం సమీపంలో ఉన్న శాంతినికేతన్‌.. రవీంద్రుడి తండ్రి దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ 1863లో నిర్మించిన ఆశ్రమం. కులమతాలకు అతీతంగా ఎవరైనా ఇక్కడకు వచ్చి పరమాత్మ ధ్యానంలో గడిపేలా దీని నిర్మాణాన్ని చేపట్టారు. తర్వాత ఈ ప్రాంతం శాంతినికేతన్‌ ఆశ్రమంగా విస్తరించింది. 1921లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఇక్కడ ‘విశ్వ-భారతి’ విద్యాలయాన్ని స్థాపించారు. భారతీయ విద్యావ్యవస్థలో ఇది చెరగని ముద్ర వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news