నీరు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని కర్టాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బెంగళూరులో నీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ నోటీస్ విడుదల చేసింది అక్కడి కాంగ్రెస్ సర్కార్. గత కొన్ని రోజులుగా బెంగళూరు నగరం…తాగునీటికి ఇబ్బందిపడుతోంది. దీంతో తాగునీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ నోటీస్ విడుదల చేశారు.
వేసవి ముదిరే కొద్దీ 40 శాతానికి పెరుగుతుందని హెచ్చరికలు జారీ చేసింది కర్టాటక ప్రభుత్వం. నీరు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తున్నట్లు… నీటి వాడకాన్ని పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ గార్డు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది కర్టాటక సర్కార్.