పంజాబ్ సీఎం మార్పు పై భగవంత్ మాన్ సంచలన కామెంట్స్..!

-

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత.. పంజాబ్ ప్రభుత్వంలో గుబులు మొదలైంది. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. దాదాపు 35 మంది ఆప్ ఎమ్మెల్యేలు గట్టు దాటేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఆప్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆప్ అధినేత కేజ్రివాల్ తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులంతా సమావేశం అయ్యారు. కపుర్తలా హౌస్ లో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై కేజ్రివాల్ చర్చించారు. ఇక సమావేశం అనంతరం భగవంత్ మాన్ ను మీడియా ప్రతినిధులు పలకరించారు. పంజాబ్ సీఎం మార్పు జరుగుతుందంట కదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కేజ్రివాల్ రాబోతున్నారని కూడా మీడియా ప్రతినిధులు ప్రశ్నలు సంధించారు. దీనికి భగవంత్ మాన్ నవ్వుతూ తోసిపుచ్చారు. అలాంటిది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news