మొన్నటికి మొన్న జరిగిన టోక్యో ఒలంపిక్స్‌లో బాగానే ఆకట్టుకున్న ఇండియా ఇప్పుడు పారా ఒలంపిక్స్‌లో కూడా ఆకట్టుకునే ప్రతయ్నాలు చేస్తోంది. ఇక పోతే ఇప్పుడు అదే టోక్యో వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో కూడా మన ఇండియా తరఫున ప్లేయర్లు అదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ ఆటల్లో భారత్‌కు తొలి పతకం దక్కడం సంచలనం రేపుతోంది. ప్యాడ్లర్ పోటీల్లో ఇండయా తరఫున ఆడిన భవీనాబెన్ పటేల్ దుమ్ములేపింది. ఇందులో ఆమె రజతం సాధించింది.
ఇక ఆమె తనకు ఉన్న అద్భుతమైన పోరాట పటిమతో భవానీ పటేల్ టేబుల్ టెన్నిస్ లో మంచి ప్రతిభ కనబర్చింది. ఇక ఆమె ఈ సారి ఏకంగా ఫైనల్లోకి దూసుకెళ్లి తన ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి అయిన యింగ్ జావోతో హోరా హోరీగా తలపడి మరీ పోరాడింది. కాగా ఆమె చేతిలో భవాని ఓటమి పాలైంది. ఈ కారణంగా ఆమెకు రజతం లభించింది. ఇక మొదటి సారి పారాలింపిక్స్‌లో ఆమె దేశానికి రజతం అందించడంతో అంతా ఆమెను ప్రశంసల వర్షం కురిపిస్తుంది.
అయితే ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. తాను ఎంతో కష్టపడి ఆడినా కూడా ఫైనల్లో నిరాశగా ఉన్నానని, తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయానని బాధపడింది. అయితే తనకు ఈ విధంగా ఆడేందుకు మాత్రం సచిన్ టెండూల్కర్ ఇన్‌స్పిరేషన్ అని చెప్పుకొచ్చింది. ఇక పారాలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న ఆమె ఆ పతకంతో ఇండియాకు వచ్చిన వెంటనే సచిన్‌ను కలుస్తానంటూ ఆవేదన చెందింది. తనకు ఆయనంటే ఇష్టమని ఆయన్ను కలిసి మెడల్ చూపించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.