జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒలంపిక్స్ 2020లో భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. ఈ సారి ఒలంపిక్స్‌లో మొత్తం 7 మెడల్స్‌ను భారత క్రీడాకారులు సాధించారు. లండన్‌లో జరిగిన 2012 ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారులు 6 మెడల్స్ ను సాధించగా.. ఇప్పుడు అంతకన్నా ఒక మెడల్‌ను ఎక్కువగానే సాధించారు. పైగా ఈసారి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. దీంతో సదరు క్రీడాకారులకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక టోక్యో ఒలంపిక్స్ లో భారత అథ్లెట్లు సత్తా చాటినందుకు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. సెహ్వాగ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న భారత్ టూర్‌లో భాగంగా టెస్టు మ్యాచ్‌లకు కామెంట్రీ చెబుతున్నాడు. అయితే ఈ ఒలంపిక్స్ లో భారత్ సత్తా చాటినందుకు సెహ్వాగ్ స్పందించాడు.
టోక్యో ఒలంపిక్స్ లో భారత క్రీడాకారులు 7 మెడల్స్ ను గెలవడం ఎంతో సంతోషంగా ఉందని సెహ్వాగ్ అన్నాడు. మన దేశంలో కేవలం క్రికెట్‌కు మాత్రమే ఎక్కువ ఆదరణ ఉందని, కానీ ఇతర క్రీడలను కూడా ప్రోత్సహించాలని దీంతో ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. మెడల్స్ సాధించిన అందరు క్రీడాకారులకు సెహ్వాగ్ అభినందనలు తెలిపాడు.
కాగా ఈ సారి ఒలంపిక్స్‌లో భారత్ మొత్తం 7 మెడల్స్‌ను సాధించింది. నీరజ్ చోప్రాకు జావెలిన్ త్రోలో గెల్డ్ మెడల్ రాగా, వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, రెజ్లింగ్‌లో రవికుమార్ దహియాలకు సిల్వర్ మెడల్స్ వచ్చాయి. అలాగే బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో లవ్లినా, మెన్స్ హాకీ జట్టు, రెజ్లింగ్‌లో బజరంగ్ పునియాలకు కాంస్య పతకాలు వచ్చాయి.