మావోలకు బిగ్ షాక్ తగిలింది. కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నాయి బలగాలు. మూడు బేస్ క్యాంపుల ఏర్పాటు పూర్తి చేశారు. ధోబే కొండలు, నీలం సరాయి కొండల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అలుబాక శివారులో మరో బేస్ క్యాంప్ ఏర్పాటు పూర్తి చేశారు. కర్రెగుట్టలపై క్యాంప్ ఏర్పాటు కోసం సిద్ధమవుతున్నారు జవాన్లు.

డ్రోన్‌ల కోసం ప్రత్యేక సిగ్నలింగ్ టవర్ల నిర్మాణం పూర్తి అయింది. CRPFకు చెందిన ప్రత్యేక K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. కర్రెగుట్టల్లో వందల సంఖ్యలో భూగర్భ బంకర్లు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. బంకర్ల గుర్తింపు కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టనుంది CRPF. ఏ క్షణమైనా భారీ ఎన్‌కౌంటర్‌కు అవకాశం ఉంది.