జగిత్యాలలో దారుణం జరిగింది. పిల్లలు పుట్టలేదు అని భార్య మమతను ఉరి వేసి హత్య చేసాడు భర్త మహేందర్. వరకట్నం, సంతానం లేదని భర్త, అత్తమామలు, కుటుంబసభ్యులు వేధింపులు చేశారు. భార్యను ఇంటికి తీసుకెళ్లి గత నెల 24న హత్య చేశారు భర్త. హత్య అనంతరం భార్య కనిపించట్లేదని పీఎస్‌లో ఫిర్యాదు చేసారు.

నిందితుడు మహేందర్ ఇంట్లో నుండి దుర్వాసన రావటంతో అనుమానించారు స్థానికులు. కుళ్ళిన స్థితిలో మమత మృతదేహం బయటపడింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొడిమ్యాల పోలీసులు.