హాస్టల్ లో ఉండే వారికి బిగ్‌ షాక్‌..ఇకపై 12 శాతం జీఎస్టీ కట్టాల్సిందే !

-

చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు సిటీలో ఉంటే.. హాస్టల్స్‌ లో ఉంటారన్న సంగతి తెలిసిందే. చాలి చాలని జీతంతో… హాస్టల్స్‌ లో ఎలాంటి ఫుడ్‌ పెట్టినా తింటూ జీవితాన్ని గడిపేస్తారు. అయితే.. హాస్టల్ లో ఉండే అలాంటి వారికి బిగ్‌ షాక్‌ తగిలింది. ఇకపై వారు 12 శాతం జీఎస్టీ కట్టాల్సిందేనట.

విద్యార్థులు ఇకపై హాస్టల్‌ వసతికి మరింత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హాస్టల్‌ అకామిడేషన్‌కు చెల్లించే అద్దెపై 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ వెల్లడించింది. పేయింగ్‌ గెస్ట్‌ (పీజీ), హాస్టళ్లు, గృహ వసతి కిందకు రావని, కాబట్టి వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉండదని ఏఏఆర్‌ కర్ణాటక బెంచ్‌ తెలిపింది. దీంతో హాస్టల్స్‌ ఉండే విద్యార్థులు షాక్‌ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news