దూసుకొస్తున్న బిపోర్​జాయ్.. 8 రాష్ట్రాలపై ప్రభావం

-

బిపోర్​జాయ్‌ తుపాను తీవ్ర రూపం దాల్చుతోంది. గురువారం రోజున తీరాన్ని దాటనున్న వేళ.. అరేబియా సముద్రంలో భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో గాలులు వీస్తున్నాయి. ఈ తుపాను ప్రభావం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ అధికారులు తెలిపారు. బుధవారం రోజున గుజరాత్‌లోని కచ్‌, దక్షిణ పాకిస్థాన్‌ వైపుగా బిపోర్‌జాయ్‌ తుపాను.. తన దిశను మార్చుకుందని ఐఎండీ తెలిపింది. అది జఖౌ పోర్టుకు సమీపంలో తీరాన్ని దాటనుందని పేర్కొంది. గురువారం సాయంత్రం దాదాపు 5.30 గంటల ప్రాంతంలో బిపోర్​జాయ్ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

బిపోర్‌జాయ్‌ తుపాను ప్రభావంతో గుజరాత్‌తో పాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గోవా రాష్ట్రాలతో పాటు దమణ్‌ దీవ్‌, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version