హైదరాబాద్‌లో రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

-

తెలంగాణలో ఆదాయ శాఖ అధికారుల దాడులు రెండోరోజు కొనసాగుతున్నాయి. సుమారు 70 బృందాలతో స్థిరాస్తి , హోటల్స్ వ్యాపారంలో భాగస్వామ్యం కలిగిన వారి ఇల్లు , కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలో రెండోరోజు ఆదాయపన్ను శాఖ సోదాలు చేస్తున్నారు.

హైదరాబాద్​ జూబ్సీహిల్స్‌లోని మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటి వద్దకు వచ్చిన ఐటీ అధికారులు.. ఆదాయపన్ను చెల్లింపు, వ్యయాలపత్రాలను పరిశీలిస్తున్నారు. అమీర్‌పేట్‌లోని జేసీ బ్రదర్స్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. గడిచిన రెండు ఆర్ధిక సంవత్సరాల వ్యాపార, ఆర్ధిక లావాదేవీలను పరిశీలిస్తున్న అధికారులు స్థిరాస్తి , హోటల్స్ వ్యాపారాల్లో భాగస్వామ్యం అనుబంధ వ్యాపారాలు, బినామీలు, డైరెక్టర్లు, మేనేజిన్గ్ డైరెక్టర్లు , సీఈఓల ఇళ్లపైన సోదాలు కొనసాగుతున్నాయి.

కొన్ని చోట్ల సోదాలు చేస్తున్న రెండు మూడు ఐటీ బృందాలు ఇవాళ్టికి కొన్ని చోట్ల తనిఖీలు ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఎమ్మెల్యేల ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతుంటే.. మరోవైపు ఆ ప్రాంతంలోకి చేరుకున్న వారి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. తమ ఎమ్మెల్యేలకు మద్దతుగా.. ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version