మెజార్టీల్లో బీజేపీ రికార్డు.. భారీ ఆధిక్యం సాధించిన తొలి ఐదుగురిలో నలుగురు కమలం నేతలే

-

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నేతల్లో పలువురు నేతలు మెజార్టీతో రికార్డులు సృష్టించారు. ఇందులో ముఖ్యంగా బీజేపీ నేతలే ఎక్కువగా ఉండటం గమనార్హం. భారీ మెజార్టీ సాధించి రికార్డులు సృష్టించిన తొలి ఐదుగురిలో నలుగురు కమలం నేతలే ఉన్నారు. ఇండోర్​ లోక్‌సభ స్థానం సిటింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ ఏకంగా 11.75 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీఎస్పీ అభ్యర్థి సంజయ్‌ సోలంకీకి 51,659 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.

ఇప్పటిదాకా సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు బీజేపీ నేత ప్రీతమ్‌ ముండే పేరిట ఉండేది. మహారాష్ట్రలోని బీడ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఈమె 2014లో 6.96 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తాజాగా ఆ రికార్డును లాల్వానీ అధిగమించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, గుజరాత్‌ బీజేపీ చీఫ్‌ సీఆర్‌ పాటిల్‌ ఏడు నుంచి ఎనిమిది లక్షలకు పైగా మెజార్టీ సాధించారు. పశ్చిమ త్రిపుర నుంచి బరిలోకి దిగిన మాజీ సీఎం బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ (బీజేపీ) 6 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యతతో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news