రేపు దిల్లీలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం

-

జాతీయ ప్రజాస్వామ్య కూటమి-ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్రమోదీ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్డీయే పక్షాల నేతలు ఓ తీర్మానం ఆమోదించారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన ఎన్డీయే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈనెల 9వ తేదీన మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ప్రస్తుత కేబినెట్‌ చివరిభేటీ లోక్‌సభ రద్దుకు చేసిన సిఫారస్‌ను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించారు.

మరోవైపు రేపు (జూన్ 7వ తేదీన) దిల్లీలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఈ పార్లమెంటరీ భేటీ తర్వాత ఎన్డీఏ నేతల సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం తర్వాత కూటమి ఎంపీల సమావేశం ఉంటుంది. ఎన్డీఏ భేటీలో మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర అంశాలపై చర్చ జరగనుంది. అనంతరం రేపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఎన్డీఏ నేతలు కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరనున్నారు. ఈనెల 9న కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రపతిభవన్‌లో కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news