హర్యానా రాష్ట్రంలో అధికారం దిశగా దూసుకు వెళ్తోంది బిజెపి పార్టీ. కాసేపటికి క్రితమే హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి బిజెపి… దూసుకు వెళ్తోంది. ప్రస్తుతం 49 స్థానాల్లో బిజెపి స్పష్టమైన ఆదిత్యాన్ని ప్రదర్శిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లోనే ఆదిత్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ హర్యానా రాష్ట్రంలో 46గా ఫిక్స్ చేశారు.అంటే బిజెపి అధికారం ఖాయమని తేలిపోయింది.
అటు హర్యానా రాష్ట్రంలో జేజేఎం, ఐ ఎన్ ఎల్ డి ప్రభావం చూపలేకపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో దూసుకుపోతోంది. అయితే ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెజ్లర్ వినేష్ ఫోగట్.. ఆదిత్యంలో కనిపించింది. కానీ 11 గంటల సమయం వచ్చేసరికి ఆమె వెనుకంజలో పడడం మనం చూస్తున్నాం.
ఆమెకు తన నియోజకవర్గంలో ఎదురుగాలి వీచే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఐదు రౌండ్లు ఇప్పటివరకు పూర్తయ్యాయి. దాదాపు 1400 ఓట్ల వెనుకంచలో రెజ్లర్ వినేష్ వెనుకంజలో ఉంది. అక్కడ బిజెపి అభ్యర్థి యోగేష్.. లీడింగ్ లో దూసుకు వెళ్తున్నారు. మరో రెండు రౌండ్లు బిజెపి ఆదిత్యంలో కొనసాగితే వినేష్ గెలవడం కష్టమేనా అని చెబుతున్నారు.