మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయఢంకా.. మరి ముఖ్యమంత్రులు ఎవరు?

-

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో మూడు రాష్ట్రాల్లో (ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్​) బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఎం రేసులో పలువురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ మూడు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టే ముఖ్యమంత్రి రేసులో ఎవరెవరు ఉన్నారో ఓసారి చూసేద్దామా.. ?

ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌ కుమార్‌ సావో, ప్రతిపక్ష నేత ధరంలాల్‌ కౌషిక్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి ఓపీ చౌధరి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో దిమానీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తోపాటు మరో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే ఓబీసీ వర్గానికి చెందిన చౌహాన్‌కే అవకాశాలెక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక రాజస్థాన్‌ రారాజు ఎవరో తేల్చే పనిలో పడింది బీజేపీ. ఈ రాష్ట్ర్ ముఖ్యమంత్రి రేసులో.. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెతోపాటు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌, అర్జున్‌ రాం మేఘ్‌వాల్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, పార్టీ నేతలు దియా కుమారి, మహంత్‌ బాలక్‌నాథ్‌ ఉన్నారు. లోక్‌సభ స్పీకరు ఓం బిర్లా కూడా సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news