రాహుల్‌తో లైవ్ డిబేట్ కు బీజేపీ రెడీ.. యువ నాయకుడికి ఛాన్స్

-

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో లైవ్ డిబేట్కు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ పార్టీ తరఫున చర్చలో పాల్గొనేందుకు ఆ పార్టీ యువ మోర్చా వైస్‌ ప్రెసిడెంట్‌ అభినవ్‌ ప్రకాశ్‌ను రంగంలోకి దింపింది. దీనిపై తన స్పందన తెలియజేయాలని కర్ణాటకకు చెందిన బీజేపీ నేత తేజస్వి సూర్య,  రాహుల్‌ గాంధీని కోరారు. ఒక రాజకీయ వారసుడికి, ఒక సామాన్యుడికి మధ్య ఈ చర్చ జరగబోతోందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల వేళ రాహుల్‌ గాంధీ, ప్రధాని మోదీ నడుమ బహిరంగ చర్చ జరగాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, దిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్‌ అజయ్‌ పి.షా, ‘ది హిందూ’ పత్రిక మాజీ ఎడిటర్‌ ఎన్‌.రామ్‌లు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్‌ గాంధీ సానుకూలంగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ కూడా ఇందులో భాగమవుతారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. అయితే, ప్రధానితో చర్చించే అర్హత రాహుల్‌కు లేదంటూ విమర్శించిన బీజేపీ ఈ క్రమంలోనే తమ పార్టీ తరఫున బీజేవైఎం వైస్‌ ప్రెసిడెంట్‌ను అభినవ్‌ ప్రకాశ్‌ను నామినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. డిబేట్‌కు అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news