ముస్లింలకు బీజేపీ ‘రంజాన్ తోఫా’

-

రంజాన్ వేడుకలకు భారతదేశం ముస్తాబవుతోంది. ఈనెల 31వ తేదీన ఈ వేడుకను దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకోనున్నారు. ఇప్పటికే ఇఫ్తార్ విందులతో దేశవ్యాప్తంగా సందడి నెలకొంది. మరోవైపు రంజాన్ సందడి దుకాణాల్లో కూడా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా దుస్తులు, ఇతర దుకాణాలు కస్టమర్లతో సందడిగా మారాయి. రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లింలకు బీజేపీ రంజాన్ తోఫా ఇవ్వాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 32 లక్షల పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వడానికి రెడీ అయింది.

ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ 32 లక్షల కిట్లను సిద్ధం చేసింది. ఈనెల 26వ తేదీ బుధవారం రోజున ఢిల్లీలో కిట్ల పంపిణీ ప్రారంభం కానుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ పంపిణీని ప్రారంభించనున్నారు. సౌగాత్ ఈ మోదీ క్యాంపెయిన్ పేరుతో ఈ కిట్లు ముస్లిం సోదరులకు బీజేపీ మైనారిటీ మోర్చా అందజేయనుంది. పురుషులు, స్త్రీలకు దుస్తులు, సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర ఇతర వస్తువులు ఈ కిట్లో ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version