బాయిల్డ్ రైస్ సేకరించేది లేదు… పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టీకరణ

-

ధాన్యం కొనుగోలులో మరోసారి కేంద్రం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో పార్లమెంట్ లో కూడా ఈ విషయాన్ని తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తారు. ఇదిలా ఉంటే ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మరోసారి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని చెప్పింది. కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి పార్లమెంట్ కు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అసరాల రీత్యా రాష్ట్రాలే బాయిల్డ్ రైస్ సేకరించుకోవాలని పార్లమెంట్ కు తెలిపారు. కేంద్రం ఇక బాయిల్డ్ రైస్ సేకరించబోమని గత ఖరీఫ్ లోనే చెప్పినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. కేంద్రం 2020-21 ఖరీఫ్లో 47.49 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించామని తెలిపారు. 6.33 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యాన్ని సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్ బాయిల్డ్ రైస్ తీసుకోం అని… ఒప్పందం ప్రకారం ‘ రా’ రైస్ తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పడంతో టీఆర్ఎస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎప్రిల్ 2 ఉగాది తరువాత నుంచి ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version