ఇండియా గురించి కేటీఆర్ కు అవగాహనే లేదు..కేసీఆర్ ను అడిగి తెలుసుకోవాలంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతుల కోసం రాహుల్ చేసిన ట్విట్ పై టీఆరెస్ నేతలు పోటీ పడి కామెంట్స్ చేశారని.. ప్రధాన ప్రతిపక్షంగా చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటారని బావించామన్నారు. కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు..కాంగ్రెస్ గురించి, ఈ దేశం గురించి కేటీఆర్ కు అవగాహన లేదని చురకలు అంటించారు.
దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తున్నా, నిజమో కాదో, తండ్రి కేసీఆర్ ను అడిగి కేటీఆర్ తెల్సుకోవాలని.. కేటీఆర్ కు గాంధీ కుటుంబానికి పోలిక ఉందా అని ఆగ్రహించారు. బాయిల్డ్ రైస్ fci కి సరఫరా చెయ్యమని సంతకం పెట్టింది కేసీఆర్ అని.. రైతులకు బియ్యంతో సంబంధం లేదని చెప్పారు.
తెలంగాణ రైతుల పంటను కొనాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర సర్కారుదేనని.. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపేటట్టేందుకు , రైతులను ఫణంగా పెడుతున్నారని ఆగ్రహించారు. రైతుల పట్ల కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, జంతర్ మంతర్ లో ఆమరణ దీక్ష చెయ్యాలని.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో జరిగే కాంగ్రెస్ ప్రజా ఉద్యమాల్లో రాహుల్ గాంధీ , ప్రత్యక్షంగా పాల్గొంటారని ప్రకటించారు.