బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన సమయానికి SLBC టన్నెల్ పూర్తి చేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగి పలువురు మరణిస్తే.. స్పందించని నేతలు.. నేడు పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. టన్నెల్ విషయాలపై పూర్తిగా అవగాహన 10కి పైగా ఏజెన్సీలు కలిసి ఈ రెస్క్యూ చేపడుతున్నాయని.. రెండు, మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి అవుతుందని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
SLBC ప్రమాదంపై BRS ఓవరాక్షన్ చేస్తోంది అన్నారు మంత్రి ఉత్తమ్. శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో.. ఆరుగురు చనిపోతే పరామర్శించలేదని గుర్తు చేశారు. అలాగే జగిత్యాల జిల్లాలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోయారు. కేసీఆర్ కనీసం అక్కడికి వెళ్లలేదన్నారు.
మాసాయిపేటలో చిన్నారులు ప్రాణాలు కోల్పోతే.. కేసీఆర్ కనీసం అడుగు కదపలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. టన్నెల్‌లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు మంత్రి ఉత్తమ్.