బ్రహ్మోస్ ఏరోస్పేస్ కేసులో నాగ్పూర్ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐకు రహస్యాలు చేరవేశారనే అభియోగాలతో నాగ్ పూర్ లోని భారత క్షిపణి కేంద్రంలో సాంకేతిక పరిశోధన విభాగంలో ఉద్యోగం చేస్తున్న అగర్వాల్ ని 2018లో ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ (ATS) సంయుక్త ఆపరేషన్లో అరెస్టు చేశారు.
ఈ కేసులో పూర్వాపరాలు విన్న కోర్టు అధికారిక లక్కు జీవిత రహస్యాల చట్టం సెక్షన్ 3, 5 కింద నాగ్పూర్ జిల్లా కోర్టు నిందితుడు నిషాంత్ అగర్వాల్ ఖైదు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి వజని తెలిపారు. అయితే, నిషాంత్ అగర్వాల్ బ్రహ్మోస్ ఫెసిలిటీ సెంటర్లో నాలుగు సంవత్సరాలు పాటు పని చేశాడు.